‘అఖండ-2’ ప్రీమియర్ షోలు రద్దు కాగా, రేపు సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ కాకపోవడం గమనార్హం. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం.. చిత్ర నిర్మాణ సంస్థ రూ.40 కోట్లు ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉందని.. అందుకే ప్రీమియర్స్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు కూడా సినిమా విడుదలవడం కష్టమేనని టాక్.