HYD: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకుని LB నగర్లోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలకు కీలకమలుపు LB నగర్ ఉద్యమమని తెలిపారు.