BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం శాంతినగర్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి చెన్నై వెళ్తున్న లారీ చక్రాయపాలెం సమీపంలో బ్రేక్ డౌన్ అయింది. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న పాల ఆటో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో అద్దంకి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.