ప్రకాశం: పొదిలిలోని ఆముదాలపల్లి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు వక్ర బుద్ధి మార్చుకోవాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.