KNR: 2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. KNRలో 15, PDPLలో 13, JGTLలో 37, SRCLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకులకు నిరాశే మిగిలింది.