AP: విజయవాడ భవానీపురంలో అధికారులు 42 నిర్మాణాలను తొలగించారు. కోర్టు ఆదేశాలతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. కట్టుబట్టలతో తమను రోడ్డున పడేశారంటూ బాధితాలు ఆందోళన వ్యక్తం చేశారు. మందులు, తిండి గింజలు, బట్టలు కూడా తీసుకోనివ్వలేదని మండిపడ్డారు. సామాన్య ప్రజలకు ఇంత అన్యాయం చేస్తారా? అంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు.