SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి రవికుమార్ ఇటీవల నిరాధార వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఇవాళ ఆమదాలవలస పోలీసు స్టేషన్లో వైసీపీ ఇన్ఛార్జిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.