TG: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్‌తో పాటు సమాన వేతనం అమలు చేస్తూ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో నోటిఫికేషన్ జారీ చేయగా… కొందరిని 2013లో.. మరికొందరిని 2014లో రెండు విడతలుగా నియమించారు. దీంతో వేతనంలో తేడాలు, సీనియారిటీ సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో విచారణ జరిపిన న్యాయస్థానం టీచర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.