MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం సారలమ్మ గద్దెకు వచ్చేరోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఒకవైపు మేడారంలో అభివృద్ధి, గద్దెల విస్తరణ పనులు జరుగుతుండగా మరోవైపు భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందస్తు మొక్కుల సందడి రోజురోజుకు పెరుగుతుంది.