MDK: సీఎం రేవంత్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మెదక్లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. డీసీసీల అధ్యక్షుల సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.