ADB: భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన ఎద్దుపై పెద్ద పులి దాడి చేసిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఎద్దు మేతకు వెళ్లి సమయంలో పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్తులు వెల్లడించారు. పెద్దపులి జాడ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావలసిన అవసరం లేదని FRO గులాబ్ సింగ్ వెల్లడించారు.