SDPT: దివ్యాంగులు అందరితో సమానమే అని జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో అభయ జ్యోతి స్పెషల్ స్కూల్లో నిర్వహించిన లీగల్ అవేర్ నెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉన్న హక్కులపై అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా లీగల్ సెల్‌ను సంప్రదించాలని సూచించారు.