MDCL: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో కరెంటు తీగలపై తిప్పతీగ మెలికలు తిరిగింది. రోజురోజుకు తీగ పెద్దదవుతుండగా, ఒక్కోసారి కరెంటు మిణుగురులు ఎగిసిపడుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. దీని కారణంగా, కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడటం, ఒక్కసారిగా శబ్దం రావడం జరుగుతుందన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అధికారులు దీనిపై స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు.