AP: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వైపు సూపర్ సిక్స్, ఇంకో వైపు ఖాళీ ఖజానా. ఎక్కడా డబ్బు దొరికే పరిస్థితి లేదు. రాష్ట్రానికి అప్పు కావాలంటే ఇచ్చేవారు ఎవరూ లేరు. అప్పు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ‘అన్నదాత సుఖీభవ’ నిధులు పడ్డాయి కాబట్టి రైతుల ముఖాల్లో హుషారు పెరిగింది’ అని పేర్కొన్నారు.