GNTR: మంగళగిరి శ్రీరామ్ నగర్ కాలనీలో ఆధునికీకరించిన ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్పీ కమాండెంట్ కే. నరేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. బెటాలియన్ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని, రిటైర్డ్ ఉద్యోగులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని నరేష్ బాబు హామీ ఇచ్చారు.