NZB :కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచారు. బుధవారం ప్రధాన కూడళ్లలో చెకోపోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ బందోబస్తు కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతోంది.