TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. యువత ఎక్కువగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు విడతలుగా జరిగిన నామినేషన్లలో 30-44 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఉన్నారు. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75% పైగా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పలువురు తమ ఉద్యోగాలను కూడా వదిలేసి మరీ పోటీలో నిల్చున్నట్లు చెబుతున్నారు.