రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ (Brijbhushan Saran Singh) తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు (Wrestlers) ఆరోపించినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నూతన పార్లమెంట్ (Parliament) భవనం ముందు ధర్నా చేసేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇక తమకు న్యాయం జరుగదని భావించిన రెజ్లర్లు.. ఇన్నాళ్లు తాము గెలుచుకున్న పతకాలను గంగానదిలో కలుపాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇవాళ సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్(Haridwar)కు చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు.రెజ్లర్లు వినేష్ ఫోఘట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఈ రోజు సాయంత్రం ఉత్తరాఖండ్(Uttarakhand)లోని హరిద్వార్‌కు చేరుకున్నారు.
పతకాలను గంగానది (Ganga river) లో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు ధర్నాకు దిగారు. రెండు రోజుల క్రితం వారు కొత్త పార్లమెంట్ భవనం ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా పోలీసులు వారిని అడ్డుకొని, అరెస్ట్ చేశారు.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ (indiagate) వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. సుప్రీం కోర్టు (Supreme Court) జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్‌సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం