KDP: ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని ఒంటిమిట్ట మండల YCP నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో YCP మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.