KDP: ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని సోమవారం బద్వేల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. అంటు వ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అన్నారు. యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. విదేశీ తరహా ఆధునిక జీవనశైలికి అలవాటు పడడమే ఎయిడ్స్‌కి ప్రధాన కారణమని తెలిపారు. హెచ్ఐవి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.