సత్యసాయి: జిల్లా YCP అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సోమవారం రొద్దం మండల కేంద్రంలోని కంబాలపల్లి గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కురుబ కులస్తుల ఆహ్వానం మేరకు హాజరైన ఆమె కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.