VSP: ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశాఖ జిల్లా పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలసికలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. వారితో ముఖాముఖి మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిడ్స్ పై అవగాహన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.