KNR: తిమ్మాపూర్ మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియను తహసీల్దార్ లక్ష్మిదేవిపల్లిలో పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ పదవులకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను అధికారులు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో పరిశీలించారు. అభ్యర్థులు, ప్రతినిధులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలని తహసీల్దార్ సూచించారు.