TG: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి పంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు సమరానికి సిద్ధమైంది. వీరిద్దరూ సర్పంచ్ పదవీకి నామినేషన్లు వేశారు. మాజీ సర్పంచ్ రాజిరెడ్డి భార్య గంగవ్వ BRS మద్ధతుతో బరిలోకి దిగగా.. కుమార్తె సుమలత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోంది. అయితే సుమలత అదే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నట్లు సమాచారం.