KRNL: ఆదోని హనుమాన్ నగర్లో అదుపుతప్పి లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. రేషన్ బియ్యం సరఫరా చేసేందుకు లారీల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం బస్తాలను లారీలో తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అదుపుతప్పిన లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. లారీలో నుంచి బియ్యం బస్తాలన్నీ మురుగు కాలువలో పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగి పడకపోవడంతో ప్రమాదం తప్పిందిని స్థానికులు తెలిపారు.