కర్నూలు NCC బెటాలియన్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల డీడీజీ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్సీసీ విద్యార్థులకు క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్నూలు ఎన్సీసీ విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.