PPM: పొగాకు ఉత్పత్తుల వాడకంతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పొగాకు రహిత సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా NCD ప్రోగ్రాం అధికారి డా. టీ. జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. పొగాకు ఫ్రీ యూత్ క్యాంపెయిన్లో భాగంగా శుక్రవారం ఎం.ఆర్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వైద్య బృందంతో కలసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.