CTR: ఎస్ఆర్ పురం మండలంలోని నందనవనం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కృపాలక్ష్మి శుక్రవారం నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు గుర్తించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.