MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలానగర్ మండలంలో చిన్నంగుల గడ్డ తండా, గంగాధర్ పల్లి, గౌతాపూర్ గుండేడు, మాచారం, మన్నెగూడెం తాండ, మోదంపల్లి, మోతీ ఘనపూర్, పెద్దాయపల్లి, ఉడిత్యాల, వాయిల్ కుంట తండా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరంతా మూడో విడత జరిగే గ్రామపంచాయతీ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.