GSLV-F12 had a successful lift-off from Sriharikota
GSLV-F12: శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. జీఎస్ఎల్వీ ఎఫ్12 (GSLV-F12) వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని ఉదయం 10.42 గంటలకు నింగిలోకి తీసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయోగం సక్సెస్ అయ్యిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభించారు. 27.30 గంటలు కొనసాగిన తర్వాత రాకెట్ (Rocket) ప్రయోగించారు.
జీఎస్ఎల్వీ ఎఫ్12 (GSLV-F12) పొడవు 51.7 మీటర్లు కాగా బరువు 420 టన్నులు.. ఇదీ దేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది. ఉపగ్రహాం బరువు 2232 కిలోల ఉండగా.. జీవిత కాలం 12 ఏళ్లు. భారత భూభాగం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందించనుంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను పంపించి నావిగేషన్ వ్యవస్థను ఇస్త్రో మరింత పటిష్టం చేసింది. తొలుత ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాం పంపించగా.. సేవలు నిలిచిపోయాయి. దీంతో ఎన్వీఎస్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఉపగ్రహాంలో రుబిడియం అటామిక్ క్లాక్ ఉంది. టెక్నాలజీని అహ్మదాబాద్‌లో గల స్పేష్ అప్లికేషన్ సెంటర్లో డెవలప్ చేసింది. ఇలాంటి టెక్నాలజీ తక్కువ దేశాల వద్ద ఉంది. రెండో తరం నావిక్ ఉపగ్రహాలు ఎల్1 సిగ్నల్స్ పంపిస్తాయి. ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేసేందుకు సహకరిస్తోంది. ఈ సిగ్నల్స్ అమెరికా డెవలప్ చేసిన జీపీఎస్‌లో వినియోగిస్తున్నారు. రెండో తరం నావిక్ ఉపగ్రహాలు 12 ఏళ్ల పాటు సేవలు అందించనున్నాయి. ప్రస్తుతం ఉన్న నావిక్ ఉపగ్రహాలు 10 ఏళ్లపాటు సేవలు అందిస్తాయి.
CONGRATULATIONS @isro !!#ISRO launches GSLV-F12 NVS-01 Mission from Satish Dhawan Space Centre (SDSC-SHAR), #Sriharikota