Mla Rajaiah: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( Rajaiah) ఎమోషనల్ అయ్యారు. తనకు ఏ పదవీ లేకున్నా ఫర్లేదు అని.. ఘన్పూర్ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అంటున్నారు. ఇక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (Srihari) కూతురు బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజయ్య (Rajaiah) బీఆర్ఎస్ ఆత్మయ సమ్మేళనంలో చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయొద్దని కోరారని రాజయ్య (Rajaiah) గుర్తుచేశారు. కోట్ల రూపాయల ఆశ చూపారని..అయినప్పటికీ తాను తలొగ్గలేదని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని రాజయ్య చెప్పారు. తన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వివరించారు. తన జీవితం స్టేషన్ ఘన్పూర్కే అంకితం అని.. ఇక్కడే సమాధాని ఏర్పాటు చేయాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి కూతురు ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ సారి కేసీఆర్ (kcr) అటు వైపు మొగ్గుచూపితే.. రాజయ్యకు (Rajaiah) టికెట్ కష్టం. అందుకే ఆయన ఇలా కామెంట్ చేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. నిజానికి నియోజకవర్గంలో రాజయ్యకు (Rajaiah) పట్టు ఉంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ.. కడియం శ్రీహరి (Rajaiah) బలమైన నేత అయినప్పటికీ ఆయన సామాజిక వర్గం పెద్దగా ప్రభావం చూపదు.
1999లో కడియం శ్రీహరి (srihari) చేతిలో రాజయ్య ఓడిపోయారు. 2009లో కడియం శ్రీహరిని ఓడించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో కూడా శ్రీహరిని ఓడించారు. 2014, 2018 ఎన్నికల్లో వరసగా రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు మరో 5, 6 నెలల సమయం ఉండగా.. రాజయ్య (Rajaiah) చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.