»Tsrtcs Talks With Rental Bus Owners Are Successful
TSRTC: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు విజయవంతం
అద్దె బస్సుల యజమానులతో చర్చలు సఫలం అయినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రభుత్వం వాటి డిమాండ్లను తీర్చకపోతే సమ్మెకు దిగుతామని యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.
TSRTC's talks with rental bus owners are successful
TSRTC: అద్దె బస్సులు యజమానులతో టీఎస్ఆర్టీసీ(TSRTC) జరిపిన చర్చలు సఫలం అయినట్లు సంస్థం ప్రకటించింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే శుక్రవారం నుంచి సమ్మె చేయబోతున్నట్లు వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) వారితో గురువారం చర్చలు జరిపారు. బస్సు యజమానులు పేర్కొన్న 5 సమస్యలను వారం రోజులలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రేపటి నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని, సంక్రాంతి పండుగకు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు.
మహాలక్ష్మి(Mahalakshmi) పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సులు పాడు అవుతున్నాయని, నిర్వహణ కష్టం అవుతుందని ప్రైవేట్ బస్సుల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ముందు 5 డిమాండ్లను పెట్టారు. ఈ రోజు వారితో చర్చించిన టీఎస్ఆర్టీసీ వారి కోరికలను జనవరి 10 లోపు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రేపటి నుంచి యథావిధిగా బస్సులు నడుస్తున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ తెలిపింది.
హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం హైర్ బస్సు యాజమానులతో #TSRTC యాజమాన్యం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు విషయాలను వారు సంస్థ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ… pic.twitter.com/axT9kChEiV