వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాట్సాప్ గ్రూపులు నిర్వహించే వారు, అడ్మిన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయా జిల్లాల పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివాదాస్పద, మతపరమైన, వ్యక్తిగత ఇబ్బందులు కలిగించే సందేశాలు ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. అలాంటి చర్యలు కేసులకు దారితీసి జీవితాలు నాశనం చేస్తాయని హెచ్చరించారు.