పెద్దపల్లి జిల్లాలో ఈనెల 28న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల వారికి పరుగు పందెం, షాట్పుట్, చెస్ వంటి పోటీలు ఉంటాయి. శారీరక, బదిర, మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా షాట్పుట్, జావలింగ్ త్రో, క్యారం బోర్డు, పరుగు పందెం వంటి పోటీలు నిర్వహించనున్నారు.