MBNR: మహమ్మదాబాద్ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు.