మాజీ ప్రధాని హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణతో హసీనాపై నమోదైన కేసులో ఆమెకు 21 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, ఢాకా అల్లర్ల కేసులో మాజీ ప్రధానిని దోషిగా తేలుస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణిశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ శిక్షను వ్యతిరేకిస్తున్నట్లు హసీనా ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేశారు.