ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన పిర్సింగుల కౌశిక్ అనే బాలుడు గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని నిమ్స్ ఆసుపత్రిలో బాలుడిని వారి కుటుంబ సభ్యులను MLA హరీష్ బాబు గురువారం పరామర్శించారు. CMRF ద్వారా రూ.10 లక్షల సహాయాన్ని అందజేసి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయిస్తామని వారి తల్లిదండ్రులకు తెలిపారు.