TG: గ్రూప్-2 ర్యాంకర్ల అప్పీల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. 2019 నాటి సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. నేటి విచారణలో కోర్టు ఏం చెబుతుందనేది అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది.