MDK: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేటకు చెందిన నవ వరుడు నాందేడ్ నరేష్, తన వివాహ సందర్భంగా భార్యకు వినూత్న కానుక ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సంప్రదాయ బహుమతులకు బదులుగా ఒక సంస్థలో తన పేరు మీద సేవింగ్స్ ప్లాన్(బీమా) తీసుకుని, తన భార్య కావేరిని నామినీగా చేర్చారు. భవిష్యత్ అవసరాల కోసం ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవ దంపతులు తెలిపారు.