KRNL: కర్నూలులో ‘ఇట్స్ ఓకే గురు’ చిత్ర బృందం సందడి చేసింది. బుధవారం కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సినిమా ట్రైలర్ ను రాజ్యసభమాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విడుదల చేశారు. హీరో సాయి చరణ్, హీరోయిన్ ఉషశ్రీ ఈ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి అలరించారు. డిసెంబర్ 5న విడుదల అవుతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని నటీనటులు కోరారు.