అన్నమయ్య: మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సీటీఎం సమీపంలోని నాగలరాళ్ల వద్ద ఆటో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.