AP: నెల్లూరు వెంకటరమణాపురంలో పోలీసులు భారీగా సిగరెట్లను పట్టుకున్నారు. గోదాములో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువ చేసే బిల్లులు లేని సిగరెట్లను సీజ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.