GNTR: మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతమ్ బుద్ధ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న వ్యతిరేక దాడులు, దౌర్జన్యాలపై వారు గళమెత్తారు.