AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మన హక్కులకు పెద్దదిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగ దినోత్సవాన్ని మా పాఠాశల విద్యాశాఖ వినూత్నంగా జరుపుతోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. మా విద్యార్థులు సభను ఎలా నడిపిస్తారని ఆసక్తిగా ఉంది’ అని పేర్కొన్నారు.