ELR: ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా వేధింపుల వ్యతిరేక దినోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు ఆన్లైన్ వేధింపులకు ఎక్కువగా గురవుతున్నారని చెప్పారు. ఫోన్లను ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.