SKLM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న ఫిర్యాదులను నాణ్యతతో అధికారులు పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏ విధమైన పొరపాట్లను సహించేది లేదన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశుధ్యం విషయంలో అధికారులు మరింత సీరియస్గా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.