AKP: నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్లో వచ్చి లారీని ఢీ కొట్టాడని స్థానికులు తెలిపారు. కాగా ఘటనలో బైకర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ద్విచక్ర వాహనం లారీ కింద చిక్కుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు.