కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం NSS క్యాంపును నిర్వహించి ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి, కార్యదర్శి డి బాపూజీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు సరళ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.