కృష్ణా: హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో కొంతమంది యువకులు కలకలం సృష్టించారు. వారు ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ ఆవరణలో తిరిగుతూ, కాలేజీ విద్యార్థినులతో అవహేళనగా, అసభ్యభరితంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితిని గమనించిన జంక్షన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి, యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.