MDK: తూప్రాన్ పట్టణంలో మహిళా సంఘాలకు శ్రీనిధి లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని శ్రీనిధి రీజినల్ మేనేజర్ గంగారాం పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిఓ ఆషియాతో కలిసి శ్రీనిధి రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఒక్కొక్క ఆర్.సి వారీగా సమీక్ష నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.